నిరాశొద్దు...రాక్షస పాలన అంతమయ్యే రోజులు దగ్గర్లోనే..: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అమరావతి: తెలుగుతేజం ఎన్టీఆర్ తెలుగు ప్రజల క్షేమం, బాషాభివృద్ధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీని ఏర్పాటు చేశారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
అమరావతి: తెలుగుతేజం ఎన్టీఆర్ తెలుగు ప్రజల క్షేమం, బాషాభివృద్ధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీని ఏర్పాటు చేశారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
''40 ఏళ్లుగా ఎన్నో ఎత్తుపల్లాలను, ఒడిదుడుగులను పార్టీ ఎదుర్కొని కార్యకర్తల త్యాగ ఫలంగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు నడపడం జరిగింది. నేడు రాష్ట్రంలో పాలన కుంటుపడింది. అరాచక, ఆటవిక విధానంలో పాలన సాగుతోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. రాక్షస పాలన అంతమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వంపై పోరాటం చేసి మళ్లీ టీడీపీని అధికారంలోకి తెచ్చుకోవాలి. ధైర్యంతో ముందుకుసాగి తెలుగుదేశాన్ని మళ్లీ విజయం బాటలో నడిపించేందుకు కృషి చేసి తెలుగుజాతి గౌరవాన్ని నిలబెడదాం'' అని బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు.