Asianet News Telugu

పక్కా ఇళ్లు కాదు ఉన్న ఇళ్లపైకే జేసిబిలు: సీఎం నివాసం వద్ద తాడేపల్లివాసుల ఆందోళన

Jun 25, 2021, 11:26 AM IST

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద అమరా రెడ్డి నగర వాసులు ఆందోళనకు దిగారు. గతంలో పక్కా గృహాలు కట్టించి, నష్టపరిహారం చెల్లించాక మాత్రమే ఇల్లు ఖాళీ చేయిస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారని... కానీ ఇప్పుడు నిర్ధాక్షణ్యంగా నష్టపరిహారం చెల్లించకుండా ఇల్లు ఖాళీ చేయమనటం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకోడానికి స్థలం చూపించి కనీస సౌకర్యాలు కల్పించకుండానే తమ ఇళ్లపైకి జెసిబిలు పంపించడం దారుణమంటూ సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద మహిళలు బైఠాయించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సీఎం నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు.

Video Top Stories