Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరి పట్టణంలో కాళీమాత ఆలయం కూల్చివేత

మంగళగిరి : మంగళగిరి పట్టణంలోని కాళీమాత ఆలయం కుల్చివేతలో ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధుల సొంత ప్రయోజనం కోసం తొలగింపునకు పునుకోవటం హేయమైన చర్య అని బీజేపీ నేతలు విమర్శించారు.

మంగళగిరి : మంగళగిరి పట్టణంలోని కాళీమాత ఆలయం కుల్చివేతలో ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధుల సొంత ప్రయోజనం కోసం తొలగింపునకు పునుకోవటం హేయమైన చర్య అని బీజేపీ నేతలు విమర్శించారు. నేడు ఆలయం వద్దకు వచ్చిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాటిబడ్ల రామకృష్ణతో పాటు జిల్లా, స్థానిక నేతలు స్వయంగా పరిశీలన చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లడుతు కేవలం ఇక్కడ నగరపాలక సంస్థలో పనిచేసే ఓ అధికారి, స్థానిక  ప్రజాప్రతినిధి ఇలాంటి పనులను మానుకోవాలని హిందూమతంను కాకుండా ఇతర మతాలకు ప్రాధాన్యత ఇచ్చేలా వారి ప్రవర్తన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్ డోజర్ లు తీసుకుని వస్తే ముందుగా తమపై నుంచి పోవాలంటు స్పష్టం చేశారు