విద్యాశాఖ కార్యాలయానికి టిడిపి నేత పట్టాభి... మంత్రి సురేష్ కోసం ఎదురుచూపు

విజయవాడ: జగనన్న గోరుముద్ద పథకంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ టిడిపి నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపణలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలకు వేడెక్కించాయి.

Share this Video

విజయవాడ: జగనన్న గోరుముద్ద పథకంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ టిడిపి నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపణలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలకు వేడెక్కించాయి. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నాని...దమ్ముంటే విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయంలో చర్చకు రావాలంటూ పట్టాభి ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇబ్రహింపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ కార్యాలయం (ఆంజనేయ టవర్స్) వద్దకు పట్టాభి చేరుకుని మంత్రి ఆదిమూలపు సురేష్ కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రి వస్తే ఆయన ఎదుటే గోరుముద్ద పథకంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని... లేకుంటే బయటే మీడియాతో మాట్లాడి వెళ్తామని పట్టాభి తెలిపారు. ఈ క్రమంలోనే ఆంజనేయ టవర్స్ వద్ద భారీగా మొహరించిన పోలీసులు పట్టాభితో పాటు మిగతా నాయకులను గేటువద్దే అడ్డుకున్నారు. వారిని లోపలికి అనుమతించలేదు.

Related Video