Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన ముసలం... వైసీపీ కి మున్ముందు మరిన్ని కష్టాలు..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 2019లో తన పార్టీని భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా వైఎస్ జగన్.. పార్టీపై, పాలనపై పూర్తి నియంత్రణతో ముందుకు సాగుతున్నారు.అయితే ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ  ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో వైసీపీ ఓటమి.. ఆ పార్టీలో కలకలం రేపుతోంది. అయితే ఎన్నికలకు మరో ఏడాది  సమయం ఉన్నందున.. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఇటీవలి కాలంలో మొత్తం 21 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. వైసీపీ 17, టీడీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైన టీడీపీ.. ఆ తర్వాత జరిగిన పలు ఎన్నిక ఘోర ఓటమిని చవిచూసింది. అయితే ఇప్పుడు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీలో జోష్‌ను నింపింది.