పోలింగ్ కొనసాగుతుండగానే... ఎన్నికలను బహిష్కరించి టిడిపి సర్పంచ్ అభ్యర్థి

కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామపంచాయితీ ఎన్నికలను పోలింగ్ రోజే టిడిపి సర్పంచ్ అభ్యర్థి బహిష్కరించారు. 

First Published Feb 21, 2021, 4:30 PM IST | Last Updated Feb 21, 2021, 4:30 PM IST

కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామపంచాయితీ ఎన్నికలను పోలింగ్ రోజే టిడిపి సర్పంచ్ అభ్యర్థి బహిష్కరించారు. టీడీపీ బలపరిచిన  గ్రామ సర్పంచ్ అభ్యర్థి సంగెపు జ్యోతి ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ అధిష్టానం తమను మోసాగించిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ 14మంది వార్డు సభ్యులతో కలిసి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తమకు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పిన టిడిపి నాయకులు పట్టించుకోలేదనే ఇలా పోటీలోంచి తప్పుకుంటున్నట్లు జ్యోతి వెల్లడించారు. టీడీపీ వైఖరికి నిరసిస్తూ గ్రామ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని కోటా హరిబాబు ప్రకటించారు.