అందుకూ నేను సిద్దమే... చంద్రబాబు ఎలాగంటే అలా..: కేశినేని నానితో వివాదంపై సోదరుడు చిన్ని
విజయవాడ : సొంత సోదరుడు, టిడిపి కే చెందిన కేశినేని శివనాథ్ (చిన్ని) పై ఎంపీ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదుచేయడం విజయవాడ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
విజయవాడ : సొంత సోదరుడు, టిడిపి కే చెందిన కేశినేని శివనాథ్ (చిన్ని) పై ఎంపీ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదుచేయడం విజయవాడ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ వివాదంపై తాజాగా శివనాథ్ స్పందించారు. చిల్లర వివాదంలోకి తననే కాదు ఇంట్లోని ఆడవాళ్లను లాగడం చాలా బాధాకరమన్నారు. శత్రుత్వం వుంటే తనపై రాజకీయ విమర్శలు చేయొచ్చు... కానీ కుటుంబంలోని ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదన్నారు. తనపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహరమేనని... ఇందుకు రాజకీయాలు కారణం కాదని శివనాథ్ స్పష్టం చేసారు.టిడిపి అధినేత చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికే తామంతా కష్టపడుతున్నామని కేశినేని చిన్ని పేర్కొన్నారు. నాని తన సొంత అన్న... శత్రువేం కాదన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్దంగా వున్నాను... పార్టీ ఆదేశిస్తే నాని గెలుపు కోసం పని చేస్తానని శివనాథ్ అన్నారు.