వైసీపీ నేతల విచ్చలవిడి తనం వల్లే కరోనా విజృంభణ.. నిమ్మకాయల చినరాజప్ప
కరోనాను జగన్ ప్రభుత్వం గాలికి వదిలిందని, అందుకే రాష్ట్రంలో ఇప్పటివరకు 700మంది మరణించారని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విరుచుకుపడ్డారు.
కరోనాను జగన్ ప్రభుత్వం గాలికి వదిలిందని, అందుకే రాష్ట్రంలో ఇప్పటివరకు 700మంది మరణించారని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విరుచుకుపడ్డారు. అందుకే టీడీపీ నేటినుండి 29 వరకు వివిధ దశల్లో ఉద్యమం చేపడుతోందని నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వైసీపీ నాయకులు విచ్చలవిడిగా తిరగడం, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్ని తోలడం వల్లే కరోనా విజృంభించిందని మండిపడ్డారు. కరోనా ప్రభావం గమనించే అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసారు. అందుకే జగన్ ప్రభుత్వం ఆయన్ని తప్పించి కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. నిమ్మగడ్డ మీద గవర్నర్ నిర్షయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.