Asianet News TeluguAsianet News Telugu

నిండుసభలో వైఎస్ భారతిని మోకాళ్లపై కూర్చోబెడతారా..?: టిడిపి ఎమ్మెల్యే సంచలనం

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై అధికార వైసిపికి అనుకూల పత్రిక సాక్షి తప్పుడురాతలు రాసి అసత్యప్రచారం చేస్తోందని టిడిపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి ఆరోపించారు. 

First Published Mar 22, 2023, 12:54 PM IST | Last Updated Mar 22, 2023, 12:54 PM IST

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై అధికార వైసిపికి అనుకూల పత్రిక సాక్షి తప్పుడురాతలు రాసి అసత్యప్రచారం చేస్తోందని టిడిపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి ఆరోపించారు. స్పీకర్ పోడియం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపైనే వైసిపి సభ్యులు దాడిచేసి తామే దాడిచేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని... ఈ అసత్య ప్రచారానికి సాక్షిని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈనాడు సంస్థ అధినేత రామోజీరావును మోకాళ్లపై కూర్చోబెట్టాలని అన్నారుగా... మరి ఇప్పుడు సీఎం సతీమణి వైఎస్ భారతిని మోకాళ్లపై కూర్చోబెడతారా? అని ప్రశ్నించారు. పాత పోటోలతో తప్పుడు వార్తను ప్రచురణపై ఏం సమాధానం చెబుతారు? అని ఎమ్మెల్యే వీరాంజనేయులు ప్రశ్నించారు.