అచ్చెన్న అరెస్టుపై నిరసన.. దేవినేని ఉమ హౌస్ అరెస్ట్..

విజయవాడలో మాజీ మంత్రి అచ్చెంనాయుడు అరెస్ట్ పై టీడీపీ ఆందోళనలు చేపట్టింది.

First Published Jul 2, 2020, 1:08 PM IST | Last Updated Jul 2, 2020, 1:08 PM IST

విజయవాడలో మాజీ మంత్రి అచ్చెంనాయుడు అరెస్ట్ పై టీడీపీ ఆందోళనలు చేపట్టింది. టీడీపీ శ్రేణులు పార్టీ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. నిరసన కోసం బయల్దేరుతున్న టీడీపీ నేత దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దాంతో ఏసీబీ అధికారులు ఆయన్ను నేరుగా సబ్‌జైలుకు తరలించిన విషయం తెలిసిందే.