ఘన నివాళి... మనవడు దేవాన్ష్, కొడుకు లోకేష్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు చంద్రబాబు
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 98వ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు.
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 98వ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. తనయుడు లోకేష్, మనవడు దేవాన్ష్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న చంద్రబాబు సమాధిపై పూలుజల్లి నివాళి అర్పించారు. వీరివెంట తెలంగాణ టిడిపి అధ్యక్షులు రమణతో పాటు ఇతర నాయకులు వున్నారు.