
Mock Drill Assembly with Students: అధ్యక్షా.. అసెంబ్లీలో అదరగొట్టిన పిల్లలు
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ‘సంవిధాన్ దివస్ – రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన మాక్ డ్రిల్ అసెంబ్లీ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పద్ధతులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. భవిష్యత్తు నాయకులుగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌కు మంచి స్పందన లభించింది.