శెభాష్ తమ్ముళ్లూ ప్రాణం పెట్టి గెలిచారు.. కార్యకర్తలకు టానిక్ లాంటి స్పీచ్ | Asianet Telugu
కార్యకర్తలను చూస్తే తనకు కొండంత ధైర్యం వస్తుందని ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీఅధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. "8 నెలలుగా పరిపాలనలో నిమగ్నమయ్యాను. అందుకే పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయాను. మళ్లీ కుటుంబ సమానులైన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉంది. 30 ఏళ్ల తర్వాత జీడీ నెల్లూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేశాం. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేశారు. మీకు నేను పూర్తిగా సహకరిస్తా...ఈ నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా మార్చాలి. తంబళ్లపల్లి, పుంగనూరులో కొంచం గురితప్పాం తప్ప జిల్లా అంతటా టీడీపీ జెండా ఎగిరింది. వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్నవాళ్లు ఇప్పుడు ఏమయ్యారు.? మొన్నటి ఎన్నికల్లో సరిగా చేసుకుని ఉంటే పులివెందులలోనూ మనమే గెలిచేవాళ్లం. పార్టీ స్థాపించిన నాటినుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. ఈ సారి మనం పగడ్బందీగా వ్యవహరించడంతో ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు గెలిచాం. మిమ్మల్ని, నన్ను ఎన్ని ఇబ్బందుల పెట్టినా ప్రాణాలు పోయినా పర్వాలదుగాగానీ, వారికి లొంగబోమని పోరాడటంతో 93 శాతం సీట్లు గెలిచాం.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.