దుర్గమ్మ దర్శనానికి వెళుతుండగా రోడ్డుప్రమాదం... 10మంది మహిళలకు గాయాలు

విజయవాడ: తణుకు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి 20 మంది భక్తులతో బయల్దేరిన టాటా మినీ వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.  

Share this Video

విజయవాడ: తణుకు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి 20 మంది భక్తులతో బయల్దేరిన టాటా మినీ వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై అదుపుతప్పిన వాహనం పల్టీలు కొడుతూ బోల్తా పడింది. దీంతో 20 మంది మహిళల్లో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న వీరవల్లి ఎస్సై గాయపడిన భవానిలను ఆస్పత్రికి తరలించారు.

Related Video