Asianet News TeluguAsianet News Telugu

మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో గర్భిణి మహిళల దయనీయ పరిస్థితి...

మచిలీపట్నం : నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు... అంటూ ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి గురించి వ్యంగంగా సాగే సినిమా పాట మీకు గుర్తుందా?

First Published Aug 17, 2022, 11:50 AM IST | Last Updated Aug 17, 2022, 11:50 AM IST

మచిలీపట్నం : నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు... అంటూ ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి గురించి వ్యంగంగా సాగే సినిమా పాట మీకు గుర్తుందా? ఈ పాటలో పేర్కొన్నట్లే ప్రస్తుతం కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులు వున్నాయి. మరీముఖ్యంగా ఇక్కడ వైద్యం కోసం వచ్చే గర్భిణి మహిళల పరిస్థితి మరీ దారుణంగా వుంటోందని... అసలు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడంటూ ఓ గర్భిణి మహిళ ఆవేధన వ్యక్తం చేసింది. ప్రభుత్వాస్పత్రిలో ఓపి గర్భిణి మహిళలకు స్కానింగ్ సేవలు నిలిపివేసారని... కేవలం ఇన్ పేషెంట్స్ కి మాత్రమే స్కానింగ్ చేస్తున్నారని గర్భిణి మహిళ తెలిపారు. నెలలు నిండిన గర్భిణులు గంటల తరబడి స్కానింగ్ విభాగం ముందు ఎదురుచూడాల్సిన దారుణ పరిస్థితి వుందన్నారు. ఇలా మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో వైద్యంకోసం వెళ్ళే గర్భిణులు నరకయాతన అనుభవిస్తున్నారని గర్భిణి మహిళ తెలిపింది.