Asianet News TeluguAsianet News Telugu

70 రోజుల తర్వాత తెరుచుకున్న ప్రకాశం బ్యారేజ్ (వీడియో)

విజయవాడ- గుంటూరు నగరాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో వెలుగు చూడటంతో రెండు జిల్లాలను కలిపే ప్రకాశం బ్యారేజ్‌పై వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. 

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా అన్ని ప్రాంతాలను అధికారులు లాక్ చేసేశారు. దీంతో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. రెడ్ జోన్లు, కంటైన్‌మెంట్లలో మరింత కఠినంగా వ్యవహరించారు.

విజయవాడ- గుంటూరు నగరాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో వెలుగు చూడటంతో రెండు జిల్లాలను కలిపే ప్రకాశం బ్యారేజ్‌పై వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సుమారు 70 రోజుల పాటుగా ఉన్న ఈ ఆంక్షలను అధికారులు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే జనం రోడ్ల మీదకు వస్తుండటంతో వాహనాల రద్దీ కనిపిస్తోంది.