Posani Krishna Murali: పోసాని భార్య కుసుమలతకు YS జగన్ ఫోన్

Share this Video

సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం ఫోన్ లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు.

Related Video