Posani Krishna Murali: పోసాని ఎప్పుడూ పద్ధతిగానే మాట్లాడేవాడు: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
పోసాని కృష్ణమురళి అరెస్టును అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసాని అరెస్ట్ చేశారని ఆరోపించారు.. రేపటి డేట్ తో పోసానికి నోటీసులు జారీ చేయడం వెనుక పోలీసుల అత్యుత్సాహం ఏంటని ప్రశ్నించారు. కక్ష సాధింపు రాజకీయాలపై అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు, వారి తప్పిదాలను విమర్శించిన పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.