బెజవాడ గ్యాంగ్ వార్ : రోజుకో ట్విస్ట్... పూటకో మలుపు..

కృష్ణ జిల్లా బెజవాడలో కలకలం రేపిన గ్యాంగ్ వార్ మూలాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

Bukka Sumabala | Asianet News | Updated : Jun 08 2020, 03:23 PM
Share this Video

కృష్ణ జిల్లా బెజవాడలో కలకలం రేపిన గ్యాంగ్ వార్ మూలాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. దీంట్లో భాగంగా స్ట్రీట్ ఫైట్ లో పాల్గొన్న వారి నేరచరిత్ర పై ఆరా తీస్తున్నారు. మంగళగిరి కి చెందిన ఇద్దరు రౌడీ షీటర్లతో పాటు మరో పదమూడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సందీప్ గ్యాంగ్ వాడిన ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. సందీప్ గ్యాంగ్ వివరాలను సీపీ ద్వారకాతిరుమల రావు మీడియాకు వెల్లడించనున్నారు. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డీల్ కుదిర్చిన నాగాబాబులను పోలీసులు విచారిస్తున్నారు. నాగబాబు అనుచరుడు 
దాస్ ల్యాండ్ సెటిల్మెంట్ లో కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Related Video