ఇదేం బుద్ది.. అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ టీజింగ్.. దిశచట్టం కింద అరెస్ట్..
విశాఖలో ఒంటరి మహిళలను టార్గెట్ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని దిశ చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖలో ఒంటరి మహిళలను టార్గెట్ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని దిశ చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. బీచ్ రోడ్ ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగినులను టార్గెట్ చేసి వారి వెంటపడుతూ, వారిని అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెడుతున్నాడు ఓ వ్యక్తి. అతన్ని ఇద్దరు మహిళల సాయంతో విశాఖ దిశ పోలీస్ స్టేషన్ ఎసిపీ ప్రేమ్ కాజల్ చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుడు అఫీషియల్ కాలనీకి చెందిన రాంబాబుగా గుర్తించారు. అతనికి వివాహమై ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది. షిప్పింగ్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు