పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. అవసరమైతే ప్రాణమిస్తా: MLA సుందరపు విజయ్ కుమార్ | Asianet Telugu
Janasena Formation Day: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన జయకేతనం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సభలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడారు. తాను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని, దేశం కోసం ప్రాణమైనా ఇస్తామని చెప్పారు.