నడమంత్రపు అధికారంతో మిడిసిపడితే ఎక్కువ కాలం ఉండరు: పేర్ని నాని | Asianet News Telugu
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరో వివాదంలో చిక్కుకున్నారు. మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్ సమీపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కట్టడం అక్రమ నిర్మాణం అంటూ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యాలయం వద్ద డ్రైనేజీపై ర్యాంప్ నిర్మించడంతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. పేర్ని నాని దీనిపై స్పందించారు. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.