రోడ్లపై స్టంట్స్, రేసింగ్ చేస్తే శిక్ష ఏంటో తెలుసా?

Share this Video

రోడ్లపై రేసింగ్‌, ప్రమాదకర స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ పోలీసులు హెచ్చరించారు. నగరంలో యువకులు మోటార్‌సైకిల్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ పాదచారులకు, ఇతర వాహనదారులకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. టీమ్‌లుగా ఏర్పడి నగరంలో రైడ్‌లు నిర్వహించి 38 మంది బైక్ రేసర్లు పట్టుకుని బైక్‌లను సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలా రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేసేవారిపై జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

Related Video