Janasena 12th Anniversary: పవన్ కళ్యాణ్ హీరో ఎలా అయ్యాడు? జనసేన జెండా ప్రస్థానం | Pawan Kalyan

Galam Venkata Rao  | Published: Mar 14, 2025, 3:00 PM IST

'ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కాని గుండెల నిండా ధైర్యం ఉంది'. ఇదీ.. పవన్ కళ్యాణ్‌ 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలో చేసిన వ్యాఖ్యలు. జీరో నుంచి మొదలైన పవన్ కళ్యాణ్‌ జీవితం నేడు గేమ్‌ ఛేంజర్‌ స్థాయికి ఎదిగింది. 100 శాతం స్ట్రైయిక్‌ రేట్‌తో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. శుక్రవారం జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Read More...