
పార్టీ పెట్టాలంటే బాబాయిని చంపించి ఉండాలా? కోడికత్తి వాడాలా?: పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన జయకేతనం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరై.. ప్రసంగించారు. బలమైన భావజాలం లేకుండానే పార్టీ పెడతామా అని తనను విమర్శించే వారిని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టాలంటే తండ్రి ముఖ్యమంత్రి అయ్యి ఉండాలా? లేదా బాబాయ్ ని చంపించాలా అని నిలదీశారు.