
Pawan Kalyan Speech: అమరావతికి ప్రత్యేక నిధులిచ్చారు.. మోదీ గారికి థాంక్స్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు స్పష్టంగా కనిపించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆర్థిక లావాదేవీల కేంద్రంగా అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణం శుభసూచకమన్నారు.బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండటం అరుదైన విషయమని, దాన్ని అమరావతి సాధించిందని పేర్కొన్నారు. రూ.1334 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక కార్యాలయాలు నిర్మాణం అవుతుండటం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమన్నారు. బ్యాంకులు వేస్తున్న ఈ పునాదులు అమరావతి భవిష్యత్ ఆర్థిక బలానికి ప్రతీక అని తెలిపారు. సీఎం చంద్రబాబుపై విశ్వాసంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.