ఢిల్లీ కొత్త సీఎంకి పవన్ కళ్యాణ్ అభినందనలు | AP Deputy CM Wishes Rekha Gupta | Asianet News Telugu
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాంలీల మైదానంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. రేఖా గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రాత్మక విజయం అన్నారు. ఇది ఢిల్లీ గురించి మాత్రమే కాదని, ప్రధాని మోదీ నాయకత్వంలో NDA ద్వారా దేశాన్ని బలోపేతం చేయడమని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, ఢిల్లీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.