
తమిళనాడులో వివక్ష అనుభవించా.. ఆ పదంతో పిలిచేవారు: పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన జయకేతనం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరై.. ప్రసంగించారు. డీ లిమిటేషన్ హిందీ భాష వివక్షపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీని వ్యతిరేకించేవారు ఆయా భాషల్లోని సినిమాలను డబ్బింగ్ చెయ్యొద్దన్నారు. తమిళనాడులో రూపీ సింబల్ ను మార్చేయడంని తప్పుపట్టారు. తమిళనాడులో ఉన్నప్పుడు తాను కూడా వివక్షను ఎదుర్కొన్నానని, తనను గొల్టి అని హేళనగా పిలిచేవారని చెప్పారు.