
Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. ఆలిపిరి చెక్‌పోస్టు, ఘాట్ రోడ్లలో పోలీసులు, భద్రతా సిబ్బంది వాహనాలు, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. టీటీడీ యంత్రాంగం అప్రమత్తమై తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అనుమానితుల వివరాలను సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.