Asianet News TeluguAsianet News Telugu

నూజివీడులో దారుణం... కూతురు వయసు బాలికతో చర్చి ఫాదర్ వికృత చేష్టలు

గన్నవరం : నిత్యం ఆ దేవుడు సన్నిధిలో వుంటూ పవిత్రంగా వుండాల్సిన చర్చి పాస్టర్ పాడుపని చేసాడు.

First Published Dec 7, 2022, 10:05 AM IST | Last Updated Dec 7, 2022, 10:05 AM IST

గన్నవరం : నిత్యం ఆ దేవుడు సన్నిధిలో వుంటూ పవిత్రంగా వుండాల్సిన చర్చి పాస్టర్ పాడుపని చేసాడు. అనారోగ్యంతో బాధపడుతూ ఆ దేవుడి కృప కోసం వచ్చిన కూతురి వయసు మైనర్ బాలికను మాయమాటలతో లోబర్చుకుని చివరకు ఆమెను లేపుకుపోయాడు. ఈ దారుణం కృష్ణా జిల్లా గన్నవరంలో వెలుగుచూసింది.  

నూజివీడులో చర్చి ఫాదర్ గా పనిచేసే నాగేశ్వరరావు(45) భార్య ఇటీవలే క్యాన్సర్ తో మరణించింది. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి వుంటున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం ఓ మైనర్ బాలిక  అనారోగ్యంతో బాధపడగా తల్లిదండ్రులు చర్చికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పిన ఫాస్టర్ లోబర్చుకున్నాడు. కొన్నాళ్ళకు తల్లిదండ్రులకు విషయం తెలిసి బాలికను గన్నవరం మండలం ముస్తాబాద్ లోని పిన్ని ఇంటికి పంపారు. ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు అక్కడినుండి బాలికను లేపుకుని హైదరాబాద్ కు తీసుకెళ్లాడు. బాలిక బందువులు ఎలాగోలా హైదరాబాద్ లో వీరి ఆఛూకీ తెలుసుకుని ఫాస్టర్ ను గన్నవరం పోలీసులకు అప్పగించారు. మైనర్ బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో పంపించారు పోలీసులు.