
Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే
నెల్లూరు జిల్లా సర్వేపల్లి కాలువ ఒడ్డున పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు సిటీ డీఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నగర భద్రతను మరింత కట్టుదిట్టం చేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.