అనూష హత్య... నిందితుడికి 21 రోజుల్లో ఉరిశిక్ష లేదా ఎన్ కౌంటర్...: వాసిరెడ్డి పద్మ
గుంటూరు: నర్సరావుపేట మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష అనే యువతిని కిరాతకంగా హత్య చేశాడు విష్ణువర్ధన్ రెడ్డి అనే దుర్మార్గుడు.
గుంటూరు: నర్సరావుపేట మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష అనే యువతిని కిరాతకంగా హత్య చేశాడు విష్ణువర్ధన్ రెడ్డి అనే దుర్మార్గుడు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. విద్యార్ధిని హత్యను నిరసిస్తూ స్థానికులు, కుటుంబసభ్యులు, తోటి విద్యార్ధులు రోడ్డెక్కారు. బాధిత కుటుంబాన్ని గురువారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ సందర్బంగా పద్మ మాట్లాడుతూ... అనూష హత్య అందరిని కలిచి వేసిందని అన్నారు. బాధిత కుటుంబానికి అందరూ సంఘీబావం తెలిపాలన్నారు. ఆడపిల్ల అంటే చులకనభావం ఏర్పడిందని... ఈ దారుణాలపు చూస్తున్న అమ్మాయిలు కాలేజికి వెళ్ళలా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు. సిఎం జగన్ బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరగాలని చూస్తున్నారని...పాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలుండాలన్నారు. నిందితుడికి 21 రోజుల్లో ఉరిశిక్ష పడితే చూడాలని అందరూ కోరుకుంటున్నారని.. ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్స్ కూడా వస్తున్నాయని పద్మ తెలిపారు.