నీకు రాజకీయాలెందుకురా..! చిన్నారికి లోకేష్ స్వీట్ వార్నింగ్
మంగళగిరి : బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పర్యటించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహిళలు, చిన్నారులతో సరదాగా సంభాషించారు.
మంగళగిరి : బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పర్యటించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహిళలు, చిన్నారులతో సరదాగా సంభాషించారు. తన ముందు టిడిపి జెండా ఎత్తిన బాలుడితో 'ఇప్పుడే నీకు రాజకీయాలెందుకురా' అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇక తమ ఇళ్ల సమస్యలు పరిష్కరించాలన్న మహిళలతోనూ లోకేష్ సరదాగా ముచ్చటించారు. నేను గెలిస్తే ఏడాదిలో ఇళ్ళ పట్టాలు ఇస్తా అంటే నమ్మలేదు... ఇప్పుడేమో గెలిచిన ఎమ్మెల్యే మీవైపు రావడమే మానేసాడని అన్నారు. ఇప్పటికీ అదే చెబుతున్నా... తాను గెలిచిన ఏడాదిలో అటవీ భూముల్లో ఉంటున్న వారికి బట్టలు పెట్టి మరీ పట్టాలు ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.