పోస్టులన్నీ ఈ నెలలోనే భర్తీ చేస్తాం: నారా లోకేశ్ | AP DSC | Nominated Posts | Asianet News Telugu
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయాన్ని ఇచ్చి గ్రాడ్యుయేట్లు తమపై మరింత బాధ్యత పెంచారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఒక పద్ధతి ప్రకారం డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తామని తెలిపారు. మార్చి నెలలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ విజయోత్సవంలో ఈ ప్రకటన చేశారు. దేశంలోనే ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం టీడీపీకి ఉందని గుర్తుచేశారు. అలాంటి కార్యకర్తలకి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నామని... ఇప్పటివరకు రూ.130 కోట్లతో కార్యకర్తల సంక్షేమం చేశామని వెల్లడించారు.