userpic
user-icon

నేను అలాంటిదాన్ని ఇలాంటిదాన్నంటూ నిందలు వేసారు..: నారా భువనేశ్వరి ఎమోషనల్

Naresh Kumar  | Updated: Sep 27, 2023, 3:48 PM IST

హైదరాబాద్ : తన గురించి ఎప్పటినుండో జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రియాక్ట్ అయ్యారు. తనపై జరిగిన ప్రచారం ఎప్పటికీ మరిచిపోనంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసారు. తాను ఇలాంటిదాన్ని అలాంటిదాన్ని అంటూ నిందలు వేసారు...  తాను ఎలాంటి దాన్నో తన మనస్సాక్షికి తెలిస్తే చాలన్నారు. తన క్యారెక్టర్ ఎలాంటిదో  
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు... తన భర్త నమ్మితే చాలన్నారు. మనగురించి ఎవరు ఏం వాగినా అనవసరం, పట్టించుకోవద్దు... ప్రతి మహిళ తానిచ్చ సందేశం ఇదే అన్నారు. మహిళలపై నిందలు వేసేవారు వాళ్ల తల్లి, భార్య ఓ ఆడదేనని మరిచిపోతున్నారంటూ నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

మాజీ  సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై సీతానగరంలో  జరుగుతున్న నిరసన దీక్షలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ఎంతలా తాపత్రయపడ్డారో భువనేశ్వరి వివరించారు.
 

Read More

Video Top Stories

Must See