Perni Nani Satires on Pawan Kalyan: కొన్నిసార్లు అపరిచితుడు.. మరికొన్నిసార్లు దశావతారాలు
ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ లో నీరు దొరకడం లేదు, కానీ మద్యం ఏరులై పారుతోందన్నారు. అలాగే, పవన్ కళ్యాణ్ వేష ధారణపై సెటైర్లు వేశారు. కొన్నిసార్లు అపరిచితుడులా, మరికొన్ని సార్లు దశావతారంలా కనిపిస్తారని విమర్శించారు.