ఇప్పుడు ఎన్నికలొస్తే కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: నందిగం సురేష్ | Asianet News Telugu
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పగ తీర్చుకోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ ఎంపీ నందిగం సురేశ్ విమర్శించారు. గుంటూరు మిర్చి యార్డుకు మాజీ సీఎం జగన్ వచ్చినప్పుడు ప్రభుత్వం కనీస భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మాదిరిగా గతంలో తమ ప్రభుత్వం వ్యవహరిస్తే చంద్రబాబు రోడ్లపై తిరిగేవాడా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఇప్పుడు ఎన్నికలు వస్తే సింగిల్ డిజిట్ కూడా రాదని విమర్శించారు.