భాస్కర్ రావు హత్యలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర పాత్ర ఇదీ.. ఎస్పీ (వీడియో)
కృష్ణాజిల్లా మచిలీపట్నం, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య జరిగిందని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ మీడియాకు వివరించారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నం, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య జరిగిందని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ మీడియాకు వివరించారు. పక్కా పథకంతోనే భాస్కరరావును హతమార్చారని రవీంద్రనాథ్ తెలిపారు. నేనున్నా ఏం జరిగినా నేను చూసుకుంటా నా పేరు రాకుండా హతమర్చమని రవీంద్ర ముద్దాయిలను ప్రోత్సహించాడు, రవీంద్ర ప్రోత్సాహంతోనే ముద్దాయిలు భాస్కరరావును హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని అరెస్ట్ చేశాం. వీరిలో ఒకరు కొల్లు రవీంద్ర, మరొ మైనర్ బాలుడు అని తెలిపారు. అన్ని రకాలుగా కొల్లు ప్రమేయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయనకు విచారణ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్లడం జరిగిందని అన్నారు. అప్పటికే రవీంద్ర పరారవటంతో గాలింపు కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించాంచి, చిలకలపూడి సీఐ వెంకట నారాయణ నేతృత్వంలోని బృందం రవీంద్రను తుని వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.