పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికులకు MLC నాగబాబు సన్మానం | Janasena Party | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 16, 2025, 3:00 PM IST

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జయకేతనం బహిరంగ సభ విజయవంతం అయింది. ఈ సందర్భంగా సేవలు అందించిన పిఠాపురం పారిశుధ్య కార్మికులను జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు, శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ సత్కరించారు. నిస్వార్థంతో సమాజానికి సేవలను అందిస్తున్న పారిశుధ్య కార్మికులను సన్మానించడం తమకు గర్వకారణం అని తెలిపారు.

Read More...