జగన్ కట్టిన అంబేడ్కర్ మ్యూజియంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu
విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియంను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సందర్శించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఇతర నాయకులు, అధికారులతో కలిసి ఇక్కడ అసంపూర్తిగా ఉన్న పనులను పరిశీలించారు. గతంలో సీఎం చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టులను జగన్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. తాము అలా చేయబోమని.. ప్రజాధనం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.