Asianet News TeluguAsianet News Telugu

జాగ్రత్త కోటంరెడ్డి... చంద్రబాబు ఆటలో పనికిరాకుండా పోతావు : మంత్రి నాగార్జున

అమరావతి : తన రాజకీయ ప్రయోజనాల కోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గేమ్ ఆడుతున్నాడని... 

అమరావతి : తన రాజకీయ ప్రయోజనాల కోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గేమ్ ఆడుతున్నాడని... ఇందులో పావుగా మారిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకూ పనికిరాకుండా పోతాడని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబు చెప్పమన్నదే కోటంరెడ్డి చెబుతున్నాడని... తద్వారా ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబును కలిసిన తర్వాతే కోటంరెడ్డి వైసిపి ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నాడని... దీన్ని బట్టే ఎవరు ఆయనతో మాట్లాడిస్తున్నాడో అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శించే స్థాయి కోటంరెడ్డికి లేదని మంత్రి నాగార్జున హెచ్చరించారు.