Asianet News TeluguAsianet News Telugu

ఒక్కడివే రా... ఎవరి షేపులు ఎవడు మారుస్తాడో చూస్కుందా: దేవినేనికి నాని సవాల్

మచిలీపట్నం: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక ఎదవ, వాళ్ళ నాయకుడు చంద్రబాబు కూడా ఎదవేనంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

First Published Jan 19, 2021, 12:57 PM IST | Last Updated Jan 19, 2021, 12:57 PM IST

మచిలీపట్నం: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక ఎదవ, వాళ్ళ నాయకుడు చంద్రబాబు కూడా ఎదవేనంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మాటతప్పే రకం కాదని... దేవినేని సవాల్ ను స్వీకరించడానికి ఇప్పటికి చాలా సార్లు కాల్ చేసినట్లు తెలిపారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే... మగాడే అయితే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా సిద్దమా అంటూ సవాల్ విసిరారు. ఏ మీడియా ముందు కూర్చుందామో చెప్పు నేను ఒక్కడినే వస్తా... నువ్వు ఒక్కడివే రా... ఎదురు పడితే ఎవరి షేపులు ఎవడు మారుస్తాడో చూసుకుందాం అంటూ నాని హెచ్చరించారు. 

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సహచర మంత్రి పేర్నినాని తనయుడు పేర్ని కిట్టు ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కొడాలి నాని. క్రీడలను తాము ఎప్పుడు ప్రోత్సహిస్తామని... ఈ టోర్నమెంట్ ద్వారా కిట్టు మంచి పేరు వచ్చి భవిష్యత్ బాగుండాలని ఆశిస్తున్నానని అన్నారు మంత్రి కొడాలి నాని.