Asianet News TeluguAsianet News Telugu

పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం వద్ద భారీ అగ్నిప్రమాదం

ఎన్ టీ ఆర్ జిల్లా : పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ఎన్ టీ ఆర్ జిల్లా : పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 షాపులు  పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 35 లక్షలు అస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు గంటల పాటు శ్రమించి మంటలను పూర్తి స్ధాయిలో మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేసింది. షాపులు దగ్ధం అవ్వడంతో నిర్వహకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏం జరిగిందో తెరుకునేలోపే పూర్తిగా మంటలకు దగ్ధమైయిందని బాధితులు చెబుతున్నారు. కట్టుబట్టలతో బయటకు వచ్చామంటున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా కూడా తెలియడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని  బాధితులు అంటున్నారు