కాషాయ వస్త్రాలు ధరించి, కావడి భుజాన పెట్టి... విశాఖలో ఘనంగా మార్వాడీల శోభయాత్ర
విశాఖపట్నం : ప్రతిఏడాది పవిత్ర శ్రావణమాసంలో వచ్చే మొదటి ఆదివారం మార్వాడీలు విశాఖలో కావడి యాత్ర చేపట్టే విషయం తెలిసిందే.
విశాఖపట్నం : ప్రతిఏడాది పవిత్ర శ్రావణమాసంలో వచ్చే మొదటి ఆదివారం మార్వాడీలు విశాఖలో కావడి యాత్ర చేపట్టే విషయం తెలిసిందే. ఇలా ఈ రోజు మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఘనంగా సాగింది. మాధవదార కొండల్లోని స్వచ్చమైన నీటితో శ్రావణమాసంలో పరమశివున్ని అభిషేకిస్తే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. కాబట్టి విశాఖలోని మార్వాడీలు మాదవదార నుండి శోభాయాత్రగా వుత్కల్ జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. ఇలా ఇవాళ మార్వాడీ యువతీ యువకులు కాషాయ వస్త్రాలు ధరించి కావడి మోస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ కావిడి యాత్రలో మార్వాడీలతో పాటు సిందీ, రాజస్థానీ, తెలుగు ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.