పోలీసుల దెబ్బలు తాళలేక... నరసరావుపేటలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నరసరావుపేట :  మట్కా ఆడుతున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకుని చితకబాదగా... దెబ్బలు తట్టుకోలేక ఆతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

Share this Video

నరసరావుపేట :  మట్కా ఆడుతున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకుని చితకబాదగా... దెబ్బలు తట్టుకోలేక ఆతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. నరసరావుపేట టూ టౌన్ సీఐ, ఎస్సై రాత్రంతా అరికాళ్లు, చేతులపై విచక్షణారహితంగా కొట్టారని బాధితుడు మాలిక్ తెలిపాడు. ఉదయం మళ్లీ పోలీస్ స్టేషన్ కు రావాలని పిలవడంతో భయపడి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు హాస్పిటల్లో చికిత్సపొందుతున్న అతడు వెల్లడించారు. అయితే పోలీసులు మాత్రం తాము ఎవ్వరినీ కొట్టలేదని అంటున్నారు. 
 

Related Video