ప్రకాశం బ్యారేజీలో దూకిన యువకుడు... ప్రాణాలకు తెగించి కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
విజయవాడ : ప్రకాశం బ్యారేజీ పైనుండి ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణా నదిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
విజయవాడ : ప్రకాశం బ్యారేజీ పైనుండి ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణా నదిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే విషయం తెలిసిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి అతడి ప్రాణాలు కాపాడారు. మొదట నీటిలో దూకిన వ్యక్తి మునిగిపోకుండా చూసి ఆ తర్వాత అతడిని తాళ్ళ సాయంతో బయటకు తీసారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది కేబుల్ ఆపరేటర్ గా పనిచేసే నవీన్ గా గుర్తించారు. ఆ ఆత్మహత్యాయత్నంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.