పురుగులమందు తాగిన వీడియో వాట్సప్ స్టేటస్... యువకుడి ఆత్మహత్యాయత్నం

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి కొండపై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 

Share this Video

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి కొండపై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమ విఫలం కావడంతో బెస్త సుధాకర్ అనే యువకుడు పురుగుల మందు తాగాడు. కులం చూడకుండా ఎవరిని ప్రేమించవద్దని, పెళ్లికి ఒప్పుకోరని చెప్తూ పురుగుల మందు తాగిన వీడియోను వాట్సప్ స్టేటస్ లో యువకుడు పోస్ట్ చేశాడు. వాట్సప్ స్టేటస్ చూసిన అతడి మిత్రులు ఉరవకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉరవకొండ ఎస్ఏ ధరణిబాబు సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో యువకుడిని అనంతపురం తరలించారు. 

Related Video