ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. నారా లోకేశ్ సూపర్ స్పీచ్ | Asianet News Telugu
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విజయం సాధించిన అభ్యర్థులకు, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. 9 నెలల్లో అధికారంలోకి రావడమైనా, 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించినా ఒక్క టీడీపీకే సాధ్యమన్నారు. ఈ విజయం ఒక చరిత్ర అని.. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటి సారి ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు టీడీపీ కైవసం చేసుకుందని తెలిపారు. ఇంతటి విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకు, గెలుపు కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జోనల్ కోఆర్డినేటర్లు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన దమ్మున్న పార్టీ టీడీపీ అని.... తమపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తామని ఈ సందర్భంగా లోకేష్ చెప్పారు.