జగన్‌కి కొత్తపేరు పెట్టిన లోకేశ్.. చంద్రబాబుకి నవ్వు ఆగలేదు | Nara Lokesh Slams YCP | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 4, 2025, 11:00 PM IST

ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో మూడింట రెండు స్థానాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపొందారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... 2023 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక గేమ్ చేంజర్ అని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు గెలిచామని గుర్తుచేశారు. ఆ తర్వాత ప్రజల ఆదరణతో చంద్రబాబు బ్రాండ్, మోడీ మేనియా, పవన్ కళ్యాణ్ పవర్ తో 164 సీట్లతో ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు. అలాగే, ‘జగన్ చేస్తున్న పనులకు కొత్త పేరు పెట్టాం.. వన్ డే ఎమ్మెల్యే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం, ఒక రోజు అసెంబ్లీకి వచ్చి హడావిడి చేసి బెంగళూరు పారిపోతాడు’ అంటూ విమర్శలు గుప్పించారు.

Read More...