
బాబు, పవన్ ఆడపిల్లల కన్నీళ్లు కనిపించడం లేదా?: లక్ష్మీపార్వతి
ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లల కన్నీళ్లు ప్రభుత్వానికి కనపబడటం లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదని.. బ్రోకరిజం అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే లక్షన్నర కోట్లు అప్పులు చేసింది? అని, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రేపిస్టులు, దొంగలు కాలర్ ఎగురవేసుకుని తిరుగుతున్నారన్నారు. తిరుపతి లక్ష్మికి ఒక న్యాయం, ముంబయి నటి జత్వానీకి ఇంకో న్యాయమా? అంటూ లక్ష్మీపార్వతి నిలదీశారు.